చైనాలో కరోనా ఉగ్రరూపం.. వేలల్లో నమోదవుతున్న కేసులు

  • దేశంలో నిన్న ఒక్క రోజే 24,326 కేసులు
  • షాంఘైలో 12 మంది మృతి
  • సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్న జీరో-కొవిడ్ విధానం
కరోనా మహమ్మారి చైనాను పట్టిపీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చైనాలో వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో వైరస్ తొలిసారి వెలుగుచూసినప్పుడు కూడా లేనంతగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 24,326 కేసులు నమోదయ్యాయి. షాంఘైలో 12 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 

రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంబిస్తున్న జీరో-కొవిడ్ విధానం సత్ఫలితాలను  ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తోపాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


More Telugu News