నైజీరియా చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు.. 100 మందికిపైగా మృతి

  • చనిపోయిన వారంతా అక్రమ ఆపరేటర్లే
  • మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ఇంకా లెక్కిస్తున్న అధికారులు
  • ఉద్యోగాలు దొరక్క చమురుశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్న యువత
నైజీరియాలోని ఓ చమురుశుద్ధి కర్మాగారంలో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడులో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. ముడిచమురు శుద్ధికేంద్రం వద్ద తొలుత ప్రారంభమైన మంటలు ఆ తర్వాత సమీపంలోని రెండు చమురు నిల్వ ప్రాంతాలకు విస్తరించినట్టు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ఇంకా లెక్కిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

చనిపోయిన వారంతా అక్రమ ఆపరేటర్లేనని పేర్కొన్నారు. చమురుశుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క యువత చమురుశుద్ధి కేంద్రాలను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, అవసరమైన జాగ్రతలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.


More Telugu News