జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన `శేఖర్` చిత్రం మే 20న విడుదల
- రాజశేఖర్ హీరోగా శేఖర్
- ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జీవిత
- విడుదల తేదీ పోస్టర్ విడుదల
- చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న రాజశేఖర్ కుమార్తెలు
టాలీవుడ్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన 91వ చిత్రం `శేఖర్`. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరంతో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
కాగా, ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను శనివారంనాడు విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. మే 20న ఈ చిత్రం విడుదల కానున్నట్లు జీవితా రాజశేఖర్ ప్రకటించారు. కాగా ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించారు.
జీవిత మాట్లాడుతూ.. తమకెంతో సహకరించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీకృష్ణలకు ధన్యవాదాలు తెలిపారు. "ఈ చిత్రం. ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుంది. కోవిడ్ వల్ల ప్రతి కుటుంబం చాలా సఫర్ అయిన ఎమోషన్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు. రాజశేఖర్‌గారు నటించిన గోరింటాకు, అక్కమొగుడు, మా అన్నయ్య, సింహరాశి వంటి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు రాబోయే `శేఖర్` చిత్రం కూడా ఆయన స్థాయిని పెంచేలా వుంటుంది. ఈ శేఖర్ సినిమా అనుకున్న టైంలో పూర్తి కావడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది కృషి ఎంతో వుంది. రాజశేఖర్ గారు కొత్త సినిమా లుక్ పనిమీద వుండడం వల్ల రాలేకపోయారు. త్వరలో ఆ సినిమా వివరాలు కూడా తెలియజేస్తాం" అన్నారు.