నూడిల్స్ మాదిరి జ‌నం ఇన్‌స్టంట్ జ‌స్టిస్ కోరుకుంటున్నారు: సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

  • చెన్నైలో కార్య‌క్ర‌మానికి జ‌స్టిస్ ఎన్వీ హాజ‌రు
  • ఇన్‌స్టంట్ న్యాయం కోసం జ‌నం చూస్తున్నార‌ని వ్యాఖ్య‌
  • కేసు ఏదైనా లోతుగా ద‌ర్యాప్తు సాగాల్సిందేన‌ని వెల్ల‌డి
  • కింది కోర్టుల్లో స్థానిక భాషే మంచిదన్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ న్యాయ వ్య‌వ‌స్థ‌పై జ‌నంలోని అభిప్రాయాన్ని చమత్కారంగా చెప్పారు. శ‌నివారం చెన్నైలో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా త్వ‌రిత గ‌తిన న్యాయం ద‌క్కాల‌ని జ‌నం కోరుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇన్‌స్టంట్ నూడిల్స్ మాదిరిగా జ‌నం ఇన్ స్టంట్ జ‌స్టిస్‌ను కోరుకుంటున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఫ‌లితంగా నిజ‌మైన బాధితుల‌కు న్యాయం ద‌క్క‌డం లేదని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసు ఏదైనా లోతుగా ద‌ర్యాప్తు చేయాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు. కింది స్థాయి కోర్టుల్లో స్థానిక భాష వాడితే బాగుంటుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.


More Telugu News