మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరణకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
- పీజీ మెడికల్ సీట్ల దందాకు రాజకీయ రంగు
- పువ్వాడ సవాల్‌కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్
- నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న రేవంత్
- మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు సిద్ధమేనా? అంటూ ప్రతి సవాల్
పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలోని కాలేజీలే పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ స్పందించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని ఆయన చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ఆరోపణలు నిరూపించకపోతే..ముక్కు నేలకు రాసి రేవంత్ క్షమాపణ చెబుతారా? అంటూ సవాల్ విసిరారు.
పువ్వాడ సవాల్‌పై రేవంత్ రెడ్డి వెనువెంటనే స్పందించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విసిరిన సవాల్‌కు తాను సిద్ధమేనని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. తన కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు పువ్వాడ సిద్ధమేనా? అని ప్రతి సవాల్ విసిరారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా నిగ్గు తేలాలంటే పువ్వాడ కాలేజీలపై మెడికల్ కౌన్సిల్ విచారణ జరగాల్సి ఉందని రేవంత్ చెప్పారు. పువ్వాడ అజయ్ కుమార్ తప్పు చేశారని నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్ చెప్పారు. మరి మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు పువ్వాడ అజయ్ సిద్ధమేనా? అని రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.