'డీజే టిల్లు' హీరో ఆ సినిమా నుంచి అందుకే తప్పుకున్నాడా?
- 'డీజే టిల్లు'తో మంచి క్రేజ్
- సిద్ధుకి పెరుగుతున్న అవకాశాలు
- ఆయన ముఖ్య పాత్రలో మలయాళ రీమేక్
- మనసు మార్చుకున్న సిద్ధు
సిద్ధు జొన్నలగడ్డ ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు ఆయన కెరియర్ కి అంతగా హెల్ప్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన సితార బ్యానర్లో 'డీజే టిల్లు' చేశాడు. ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. సిద్ధు జొన్నలగడ్డపై క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతగా ఆయన పాత్ర వాళ్లకి కనెక్ట్ అయింది.
అయితే అదే బ్యానర్లో మరో సినిమాను చేయడానికి సిద్ధు ముందుగానే ఓకే చెప్పేశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కప్పెలా' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం 'అనైక సురేంద్రన్' ను తీసుకున్నారు. శౌరి చంద్రశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ సినిమాలో సిద్ధు పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుంది. అయితే 'డీజే టిల్లు'తో వచ్చిన క్రేజ్ తరువాత ఈ పాత్రను చేయడం కరెక్ట్ కాదనిపించడంతో, ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడని అంటున్నారు. ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉండగా ఆయన తప్పుకోవడంతో, ఇప్పుడు ఇంకో హీరో కోసం వెదుకుతున్నారట.