ఫ్యూచర్ గ్రూప్‌తో డీల్ రద్దు చేసుకున్న రియలన్స్
- ఫ్యూచర్ గ్రూప్‌ను కొనేందుకు రిలయన్స్ ఆసక్తి
- రూ.24,713 కోట్లను ఆఫర్ చేసిన రిలయన్స్
- ఈ డీల్‌కు ససేమిరా అన్న ఫ్యూచర్ గ్రూప్ ఇన్వెస్టర్లు
- డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు రియలన్స్ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫ్యూచర్ గ్రూప్‌ల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదానికి ఎట్టకేలకు శనివారం తెర పడింది. ఫ్యూచర్ గ్రూప్‌ను తనలో విలీనం చేసుకునేందుకు ఆసక్తి చూపగా.. ఆది నుంచి రిలయన్స్ చర్యలకు బ్రేకులు పడుతూనే వస్తున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ యాజమాన్యం రిలయన్స్ ప్రతిపాదనకు సిద్ధంగానే ఉన్నా... ఆ గ్రూప్ వాటాదారులు మాత్రం అందుకు సమ్మతించడం లేదు. మధ్యలో అమెజాన్ నుంచి ఎప్పటికప్పుడు ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రిలయన్స్‌లో ఫ్యూచర్ గ్రూప్ విలీనం పలుమార్లు కోర్టు మెట్లెక్కింది కూడా. అయితే ఎట్టకేలకు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్ శనివారం కీలక ప్రకటన చేసింది. అంతకుముందు ఫ్యూచర్ గ్రూప్‌ను చేజిక్కించుకునేందుకు రిలయన్స్ రూ.24,713 కోట్ల మేర ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌కు ఫ్యూచర్ గ్రూప్ యాజమాన్యం ఒప్పుకున్నా.. ఆ కంపెనీ వాటాదార్లు ససేమిరా అన్నారు. ఈ కారణంగానే ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు రిలయన్స్ శనివారం ప్రకటించింది.