ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్... ముంబైలో హైటెన్షన్
- సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తానన్న ఎంపీ
- అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
- తామేం తప్పు చేయట్లేదని పోలీసులతో నవనీత్ కౌర్ వాగ్వాదం
- ఉదయం నుంచి కొనసాగుతున్న హైటెన్షన్
హనుమాన్ చాలీసా వివాదం మహారాష్ట్ర రాజధాని ముంబైలో హైటెన్షన్ వాతావరణానికి తెర తీసింది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా... తాజాగా ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అయితే సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. మొత్తంగా నవనీత్ కౌర్ ప్రకటన, ఆ తర్వాత పోలీసుల చర్యలతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.