మోదీపై పనిగట్టుకుని తప్పుడు రాతలు రాస్తున్నాయంటూ.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై ప్రివిలేజ్ నోటీసులు
- రాజ్యసభలో నోటీసులు ఇచ్చిన బీజేపీ నేత జీవీఎల్
- కేంద్రం సాయం చేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలంటూ మండిపాటు
- కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదన్న జీవీఎల్
- మోదీపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అసత్య వార్తలు రాస్తున్నాయంటూ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ఈ మేరకు ఈ రెండు పత్రికలపైనా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు పత్రికలు పనిగట్టుకుని ప్రధాని మోదీపై తప్పుడు వార్తలు రాస్తున్నాయన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం విస్తృతంగా సాయం చేస్తున్నప్పటికీ కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని, తెలంగాణ మంత్రి కేటీఆర్ హద్దులు మీరి మరీ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీల నుంచి ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని జీవీఎల్ అన్నారు. పాలన నుంచి కుటుంబ పార్టీలను దూరం పెట్టేందుకు మోదీ ఎన్నికల అజెండాను ఖరారు చేసినట్టు జీవీఎల్ చెప్పారు.