విశాఖ ఏయూలో వైసీపీ జాబ్ మేళా.. బయట టీడీపీ నిరసన
- విశాఖ ఏయూలో వైసీపీ జాబ్ మేళా
- జాబ్ మేళాకు మారు వేషంలో వెళ్లిన టీడీపీ నేత
- జాబ్ మేళాలో సెక్యూరిటీ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నయంటూ నిరసన
నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు వైసీపీ వరుసగా ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తిరుపతిలో రెండు రోజుల పాటు జాబ్ మేళా నిర్వహించిన వైసీపీ.. తాజాగా శనివారం విశాఖలోనూ జాబ్ మేళాకు శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ జాబ్ మేళా కొనసాగుతోంది.
విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం ప్రారంభమైన జాబ్ మేళాపై విపక్ష టీడీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. జాబ్ మేళాలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు సెక్యూరిటీ గార్డు వేషంలో వెళ్లిన టీడీపీ నేత బండారు అప్పలనాయుడు... ఆ తర్వాత వర్సిటీ బయట నిరసనకు దిగారు. వైసీపీ జాబ్ మేళాలో సెక్యూరిటీ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయని బండారు ఆరోపించారు. ఉన్నత విద్యావంతులను ఊరిస్తూ ప్రకటనలు జారీ చేసి జొమాటో డెలివరీ బాయ్, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలిస్తారా? అని ఆయన విమర్శించారు.