సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో యుద్ధ‌ వీరులకు రామ్ చ‌ర‌ణ్‌ నివాళులు

  • 'అజాదీ కా అమృత్ మ‌హోత్సవ్'లో పాల్గొన్న చెర్రీ
  • దేశ సైనికుల త్యాగాల వ‌ల్లే మ‌నం ప్ర‌శాంతంగా జీవిస్తున్నామని వ్యాఖ్య‌
  • జ‌వాన్ల త్యాగాల‌ను గౌర‌వించుకోవాలన్న చ‌ర‌ణ్‌
'అజాదీ కా అమృత్ మ‌హోత్సవ్'లో భాగంగా సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్‌లో డిఫెన్స్ అధికారులు నిర్వ‌హించిన యుద్ధ‌ వీరుల నివాళుల కార్య‌క్ర‌మంలో సినీ న‌టుడు రామ్‌ చ‌ర‌ణ్ పాల్గొన్నారు. అమ‌ర‌ వీరులకు నివాళులు అర్పించిన అనంత‌రం చ‌ర‌ణ్ మాట్లాడారు. దేశ భ‌ద్ర‌త‌ను కాపాడుతున్న జ‌వాన్ల త్యాగాల‌ను గౌర‌వించుకోవాలని చెప్పారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. 

దేశంలో మ‌నం ప్ర‌శాంతంగా జీవిస్తున్నామంటే అందుకు కార‌ణం దేశ సైనికుల త్యాగాలేన‌ని చెప్పారు. మనం నడుస్తున్న భూమి, పీల్చుతోన్న‌ గాలి మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను ధ్రువ‌ సినిమాలో పోలీసు అధికారిగా న‌టించ‌డం గ‌ర్వంగా ఉందని చెప్పారు.


More Telugu News