జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారు: తులసిరెడ్డి
- జగన్ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందన్న తులసిరెడ్డి
- సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే అమలు చేశామని వెల్లడి
- జగన్ కు చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్
ముఖ్యమంత్రి జగన్ పై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలపై జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. 1975లోనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో అన్ని సంక్షేమ పథకాలను ఇందిరాగాంధీ చేర్చారని... కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ కార్యక్రమాన్ని అమలు చేశాయని చెప్పారు. జగన్ పాలనలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడిందని అన్నారు. ఆసరా, అమ్మఒడి తదితర పథకాల ద్వారా ఇస్తున్న నగదును నాన్న బుడ్డి ద్వారా లాక్కుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన బంగారు తల్లి, అమ్మ హస్తం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదని తులసిరెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కో సంఘానికి రూ. 5 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తించేదని... జగన్ పాలనలో రూ. 3 లక్షలకు కుదించారని విమర్శించారు. సంక్షేమం పట్ల జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.