15 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య.. ఇండియా కరోనా అప్డేట్స్!
- గత 24 గంటల్లో 2,527 పాజిటివ్ కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 33 మంది మృతి
- భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 15,079
ఇండియాలో కరోనా కేసులు మరోసారి 2 వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 2,527 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 1,042 కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో దేశంలో 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో 31 మరణాలు కేరళలో సంభవించగా.. ఢిల్లీలో ఇద్దరు మరణించారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రోజు కూడా కరోనా నుంచి కోలుకున్న వారికంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.75 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 15,079 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు. నిన్న 19.13 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.