'బోత్ ఆర్ నాట్ సేమ్' అంటూ విజయసాయిరెడ్డికి అయ్యన్న పాత్రుడు చురకలు
- ఏపీకి చంద్రబాబు కియా, ఎల్జీ, హెచ్సీఎల్ లాంటి కంపెనీలు తెచ్చారన్న అయ్యన్న
- యువతకి నిఖార్సైన ఉద్యోగాలు కల్పించే రేంజ్ ఆయనదని వ్యాఖ్య
- ఆ కంపెనీల్లో ఇప్పుడు సెక్యూరిటీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించారని ఎద్దేవా
'తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాయలసీమ నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన వస్తోంది. ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో, కియామోటార్స్ తదితర దాదాపు 147 కంపెనీలు ఈ జాబ్ మేళాలో యువతకు ఉద్యోగాలిస్తున్నాయి. ఉద్యోగార్థులందరూ వారి విద్యార్హతకు తగిన మంచి ఉద్యోగాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను' అంటూ ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. 'బోత్ ఆర్ నాట్ సేమ్' అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ డైలాగును అయ్యన్న పాత్రుడు ఉటంకించారు.
'కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో లాంటి కంపెనీలు తెచ్చి యువతకి నిఖార్సైన ఉద్యోగాలు కల్పించే రేంజ్ మా నేత చంద్రబాబు గారిది... అదే కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో కంపెనీల్లో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించే స్థాయి మీ నేత జగన్ రెడ్డిది. బోత్ ఆర్ నాట్ సేమ్' అని అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు.