ఢిల్లీలో ‘ఫ్లూ’ మాదిరి జ్వరాలు.. ఎక్కువ మందిలో ఈ లక్షణాలే!
- ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న కేసులు అధికం
- మూడు రోజులకు పైగా లక్షణాలు కొనసాగితే ఉపేక్షించకూడదు
- వెంటనే వైద్యులను సంప్రదించడమే మంచిది
ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సొంతంగా నియంత్రించుకోవడానికి వీలుండడంతో ఎక్కువ మంది టెస్టింగ్ కు కూడా ముందుకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ తరహా లక్షణాలు మూడు రోజులకు మించి కొనసాగితే కనుక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, అతిసారం, తీవ్ర బలహీనత, మగతగా ఉండడం, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గడం ఇవన్నీ మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలనేది సూచన.
ఆలస్యం చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ సురంజిత్ చటర్జీ అన్నారు. అందుకే ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న కేసులు గత వారం రోజుల్లో 30 శాతం పెరిగినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఓపీకి వస్తున్న రోగుల్లో 40 శాతం మందిలో ఇన్ ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు ఉంటున్నాయని మ్యాక్స్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ రోమెల్ టికూ సైతం తెలిపారు.
‘‘కోవిడ్-19 వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపించడం తగ్గిపోయింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, డయేరియా ఇతర లక్షణాలు కనిపించి రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి’’ అని ఎయిమ్స్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ తెలిపారు.