ఇండియాలో మొట్టమొదటి సూపర్ గాళ్ మూవీ 'ఇంద్రాణి'... మేకింగ్ వీడియో ఇదిగో!
- యానియా భరద్వాజ్ ప్రధానపాత్రలో ఇంద్రాణి
- హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్
- శ్రే మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం
- సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం
భారతదేశపు మొట్టమొదటి సూపర్ గాళ్ మూవీ `ఇంద్రాణి. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రే మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా మేకింగ్ వీడియో పార్ట్-1ను చిత్రబృందం నేడు పంచుకుంది.
వినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్టాన్లీ సుమన్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్లకు పైగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్, డీటైల్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో వీఎఫ్ఎక్స్ ప్లానింగ్ సినిమాను కనులవిందుగా తీర్చిదిద్దనున్నాయి. కాగా ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
ఇంద్రాణి చిత్రంపై దర్శకుడు స్టీఫెన్ మాట్లాడుతూ, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు ప్రధాన పాత్రధారుల డెడికేషన్, రిస్క్ చూసి తాను విస్మయానికి గురయ్యానని పేర్కొన్నారు. భారతీయ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్ మరియు ఎంతో రిస్క్‌తో కూడిన కత్తులను ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం ఇంద్రాణి అని ఆయన తెలిపారు. ఇంద్రాణి మొదటి మహిళా యాంటీ గ్రావిటీ మరియు జీరో-గ్రావిటీ ఫిల్మ్ అని మేకర్స్ పేర్కొన్నారు.