తిరుపతిలో ఆరోగ్య మేళా ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి... రోగులు లేకపోవడంపై అసంతృప్తి!
- తిరుపతిలో ఆరోగ్యమేళా
- వైద్యులు, సిబ్బంది తప్ప కనిపించని రోగులు
- వివరణ ఇచ్చేందుకు అధికారుల యత్నం
- వివరణలు తనకవసరం లేదన్న నారాయణస్వామి
తిరుపతిలో అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోగ్య మేళా ప్రారంభించారు. అయితే ఆరోగ్యమేళాలో వైద్యులు, సిబ్బంది తప్ప రోగులు లేకపోవడం పట్ల నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆయన తిరస్కరించారు. ఆరోగ్యమేళాకు రోగులు రాకపోవడంపై వివరణలు నాకవసరంలేదు అంటూ తీవ్రంగా స్పందించారు.
ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా అధికారుల తీరు పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికా? అంటూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా అధికారుల తీరు పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికా? అంటూ ప్రశ్నించారు.