మే 2న ఎల్ఐసీ ఐపీవో.. 40 శాతం తగ్గనున్న ఐపీవో సైజు!
- రూ.21 వేల కోట్లకు తగ్గిన విలువ
- గ్రీన్ షూ ఆప్షన్ తో మరో రూ.9 వేల కోట్లకు చాన్స్
- తాజా ముసాయిదాలో మే 12 దాకా ఐపీవోకు చాన్స్
- అంతకన్నా ముందే ఇచ్చేందుకు ప్రభుత్వ కసరత్తులు
అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల 2న ఎల్ఐసీ ఐపీవోను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఐపీవోకు సంబంధించి ప్రభుత్వం గత నెలలో తాజా ముసాయిదాను సెబీకి సమర్పించింది. దాని ప్రకారం ఐపీవో ప్రకటనకు మే 12 దాకా సమయం ఉంది. అయితే, అంతకన్నా ముందే ఐపీవోను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ఎల్ఐసీ ఐపీవో సైజును కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు అనుకున్న విలువలో 40 శాతం కోత పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రూ.21 వేల కోట్లకు ఐపీవోను ఇష్యూ చేయనున్నారని తెలుస్తోంది. అయితే, గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ.9 వేల కోట్లు వచ్చే అవకాశమూ ఉందంటున్నారు. మొత్తం కలిపి ఎల్ఐసీ ఐపీవో సైజు రూ.30 వేల కోట్లుంటుందని చెబుతున్నారు. తద్వారా ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా ఐదు శాతం తగ్గుతుందన్నారు.
గ్రీన్ షూ ఆప్షన్ అంటే..
ఇన్వెస్టర్లకు ఐపీవోకు వచ్చే సంస్థ ముందు ఇవ్వాలనుకున్న షేర్ల కన్నా ఎక్కువగా అలాట్ చేయడాన్నే గ్రీన్ షూ ఆప్షన్ అంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో గ్రీన్ షూ ఆప్షన్ ను వాడుకునేలా నిబంధనలున్నాయి. దీని ప్రకారం ఇన్వెస్టర్లకు ముందు కేటాయించిన షేర్ల కన్నా 15 శాతం ఎక్కువ షేర్లను కేటాయించేందుకు వీలుంటుంది.
దీని వల్ల షేరు విలువల్లో స్థిరత్వం ఉండి ద్రవ్యచెలామణి పెరుగుతుంది. కాగా, గ్రీన్ షూ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే సంస్థ తొలిసారిగా ఈ ఆప్షన్ ను వాడుకుంది. దీంతో ఆ సంస్థ పేరుమీదే ఈ నిబంధనను తీసుకొచ్చారు. ప్రస్తుతం వోల్వరీన్ వరల్డ్ వైడ్ ఐఎన్ సీ అనే సంస్థలో గ్రీన్ షూ విలీనమైంది.
పెద్ద ఐపీవో..
ఐపీవో విలువ 40 శాతం తగ్గినప్పటికీ ఎల్ఐసీదే పెద్ద ఐపీవో అని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.18,300 కోట్లతో పేటీఎం ప్రవేశపెట్టిన ఐపీవో పెద్దదిగా ఉంది. 2010లో కోల్ ఇండియా ఐపీవో రూ.15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ.11,700 కోట్ల ఐపీవోలు పెద్ద ఐపీవోల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.