రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం... ఒంగోలు సభలో జగన్ ఘాటు వ్యాఖ్యలు
- నేడు ఒంగోలు పర్యటనలో ముఖ్యమంత్రి
- డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ నిధుల విడుదల
- ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్షాలపై మరోమారు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాక్షసులు, దుర్మార్గులతో పోరాటం చేస్తున్నామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఒంగోలు పర్యటనకు వచ్చిన జగన్... అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీని విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని టీడీపీ, జనసేన అంటున్నాయని చెప్పిన జగన్... ఆ రెండు పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మంచి పాలన అందిస్తున్న జగన్ పాలన వద్దట.. ఉచిత పథకాల అమలుతో రాష్ట్రం శ్రీలంక అవుతోందట. చంద్రబాబులా మోసం చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట. డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలట. పేదలకు పధకాలు ఇవ్వొద్దట.. రోజూ దీనిపైనే ప్రచారం చేస్తున్నారు. బాబు పాలనే కావాలని దుష్ట చతుష్టయం అంటోంది. చంద్రబాబు దత్తపుత్తుడూ ఇదే అంటున్నాడు. ఇలాంటి రాక్షసులు, దుర్మార్గులతో మనం పోరాటం చేస్తున్నాం" అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.