మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా!
- నిన్న 12 మంది విద్యార్థులకు కరోనా
- ఈరోజు మరో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
- 90 శాతం కేసులు ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ కు చెందినవి
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మద్రాస్ ఐఐటీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. నిన్న 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈరోజు విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించగా... మరో 18 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీ క్యాంపస్ లో కరోనా కేసుల సంఖ్య 30కి పెరిగింది.
అయితే ఈ కేసులు హాస్టల్ లో వ్యాప్తి చెందుతుండటంతో మద్రాస్ ఐఐటీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. ఐఐటీలో కరోనా సోకిన వారిలో 90 శాతం మందికి ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ అని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. మరోవైపు ఏకంగా 30 కేసులు వెలుగు చూడటంతో ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.