సిక్కోలులోనూ మట్టి మాఫియా... టీడీపీ నేతలపై వైసీపీ నేతల రాళ్ల దాడులు
- శ్రీకాకుళం జిల్లా నల్లబొడ్లూరులో అక్రమ తవ్వకాలు
- తవ్వకాలను అడ్డుకునేందుకు టీడీపీ నేతల యత్నం
- టీడీపీ నేతలను అడ్డుకున్న వైసీపీ నేతలు
- ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
కృష్ణా జిల్లా గుడివాడ కేంద్రంగా సాగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు యత్నించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరవింద్‌పై మట్టి మాఫియా దాడి చేసిందన్న వార్త విన్న కాసేపటికే ఇదే తరహాలో మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ నేతలపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేసింది వైసీపీకి చెందిన నేతలే కావడం గమనార్హం. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నల్లబొడ్లూరులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దానిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు వెళ్లారు. అయితే టీడీపీ నేతలను తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలోకి అనుమతించేందుకు వైసీపీ నేతలు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు వైసీపీ నేతలు టీడీపీ నేతలపైనా, వారి కార్లపైనా రాళ్లతో దాడులను ప్రారంభించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.