దేశంలో వరుసగా మూడో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 2,451 కొత్త కేసులు
- ఢిల్లీలో 965 కేసుల నమోదు
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,241
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే... కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4.48 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,451 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో 965 కేసులు నమోదు కాగా... హర్యానా, కేరళలో 300కు పైగా కేసులు వచ్చాయి.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 54 మంది మృతి చెందారు. 1,589 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,241గా ఉంది. దేశంలో రోజువారీ రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజు 18 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.