ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద హైటెన్షన్.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
- ఉద్యోగాల భర్తీలో జాప్యంపై బీజేపీ ఆగ్రహం
- ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపు
- భారీగా తరలివచ్చిన బీజేవైఎం కార్యకర్తలు
- ఏపీపీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే యత్నం
- బీజేవైఎం శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ యువజన విభాగం బీజేవైఎం శుక్రవారం ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపు నివ్వగా... నేటి ఉదయం పెద్ద సంఖ్యలో బీజేవైఎం కార్యకర్తలు ఏపీపీఎస్సీ కార్యాలయానికి తరలి వచ్చారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఏపీపీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. చివరకు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేవైఎం కార్యకర్తల మెరుపు నిరసనలతో ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.