గుడివాడ మట్టి మాఫియాపై చర్యలు.. 10 మందిపై కేసు, జేసీజీ సీజ్
- గుడివాడలో అక్రమ మట్టి తవ్వకాలు
- అడ్డుకునేందుకు యత్నించిన ఆర్ఐపై దాడి
- చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
కృష్ణా జిల్లా గుడివాడలో మట్టి మాఫియాపై చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుడివాడ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వాటిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆర్ఐ అరవింద్‌పై గురువారం రాత్రి మట్టి మాఫియా దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో తాజాగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఆర్ఐ అరవింద్‌పై దాడికి దిగిన 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, మట్టి తవ్వకాలకు వినియోగిస్తున్న జేసీబీని సీజ్ చేశారు. అంతేకాకుండా మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్న 3 ట్రాక్టర్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై విపక్ష టీడీపీ కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.