పునాది తీస్తుండగా బయపటడ్డ నిజాం కాలంనాటి నాణేలు!

  • నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో బయటపడ్డ నాణేలు
  • 21 వెండి, 10 రాగి నాణేలు లభ్యం
  • నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో నిజాం కాలంనాటి నాణేలు బయటపడ్డాయి. వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా 21 వెండి, 10 రాగి నాణేలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నర్సింహులు మాట్లాడుతూ, ఈ నాణేలు నిజాం కాలానికి చెందినవిగా గుర్తించామని చెప్పారు. ఈ నాణేలను పురావస్తు శాఖకు అందజేస్తామని తెలిపారు. ఈ నాణేలు 1940 సంవత్సరానికి చెందినవని చెప్పారు. రెండు కవర్లలో నాణేలు దొరికాయని తెలిపారు.


More Telugu News