ధోనీ ఆటతీరుపై జడేజా, రోహిత్ శర్మ ప్రశంసల జల్లు
- ధోనీ అత్యుత్తమ ఫినిషర్ అన్న జడేజా
- తాము గెలుస్తామనే నమ్మకం కలిగిందని వ్యాఖ్య
- ధోనీ ఎంత గొప్ప ఆటగాడో మనకు తెలిసిందేనన్న రోహిత్
- చెన్నై జట్టుని విజయ తీరాలకు తీసుకెళ్లాడని ప్రశంస
ఐపీఎల్ లో భాగంగా గత రాత్రి ముంబై జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ జరిగిన తీరు చూసి చాలా కంగారు పడ్డామని, అయినప్పటికీ ధోనీ వంటి అత్యుత్తమ ఫినిషర్ ఉండటంతో తాము గెలుస్తామనే నమ్మకం కలిగిందని చెప్పాడు.
జట్టు కోసం ఆడుతూ ధోనీ విజయాలు అందిస్తున్నాడని అన్నాడు. పవర్‌ప్లేలో ముఖేశ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు శుభారంభం అందించాడని తెలిపాడు. తాము ఫీల్డింగ్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నాడు. క్యాచ్‌లు వదిలేస్తే మ్యాచ్‌లు గెలవలేమని చెప్పాడు.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించాడు. తాము ఈ మ్యాచ్‌లో చివరివరకూ బాగానే ఆడామని అన్నాడు. తమ బౌలర్లు బాగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లారని, అయితే, ధోనీ ఎంత గొప్ప ఆటగాడో మనకు తెలిసిందేనని చెప్పాడు. ధోనీ చెన్నై జట్టుని విజయ తీరాలకు తీసుకెళ్లాడని అన్నాడు.
తమ ఓటమికి ఇదే కారణమంటూ ఏ విషయాన్నీ వేలెత్తి చూపలేమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం తాము శుభారంభం చేయలేదని, ఆదిలోనే వికెట్లు కోల్పోయామని, ఇలా జరిగితే మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడలేమని అన్నాడు.