గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- 256 కిలోల హెరాయిన్ ను పట్టుకున్న నార్కోటిక్స్ అధికారులు
- విలువ రూ.1,500 కోట్ల పైమాటేనని అంచనా
దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్‌లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్‌లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1,500 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
ఏడాదిన్నర క్రితం ఆఫ్ఘన్ నుంచి ఏపీలోని విజయవాడకు తరలివస్తున్న వేల కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను గుజరాత్‌లోనే అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. నాడు ఈ వ్యవహారంపై రాజకీయంగానే పెద్ద ఎత్తున దుమారం రేగింది.