పబ్ డ్రగ్స్ కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ
- డ్రగ్స్ కేసులో అరెస్టయిన అభిషేక్, అనిల్
- బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించిన వైనం
- నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల వాదన
- బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయమూర్తి
ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పబ్ యజమాని అభిషేక్, మేనేజర్ అనిల్‌లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు నేడు కొట్టివేసింది.
తెల్లవారుజాము దాకా కార్యకలాపాలు సాగిస్తున్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై ఇటీవలే పోలీసులు దాడి చేయగా..,. అనూహ్యంగా అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో పబ్ యజమాని అభిషేక్‌తో పాటు మేనేజర్ అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఈ క్రమంలో తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టును ఆశ్రయించారు. బెయిల్ లభిస్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు.