వివేకా హత్య కేసు విచారణకు హాజరైన సునీల్ కుమార్ యాదవ్ సోదరుడు
- మూడో దఫా దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ
- ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన సునీల్ కుమార్ యాదవ్
- తాజాగా సునీల్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్‌ను విచారించిన సీబీఐ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ మరోమారు ప్రారంభించింది. ఇప్పటికే రెండు దఫాలుగా ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ.. పలు కీలక వివరాలతో కోర్టులో చార్జిషీట్లను కూడా దాఖలు చేసింది. దర్యాప్తులో కాస్తంత గ్యాప్ ఇచ్చిన సీబీఐ... తాజాగా గురువారం మూడో విడత విచారణను ప్రారంభించింది.
ఈ విచారణలో భాగంగా ఈ కేసులో అరెస్టైన సునీల్ కుమార్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు గురువారం విచారించారు. ఈ కేసులో చిక్కుకోవడానికి ముందు వైసీపీకి సంబంధించి పులివెందుల కార్యవర్గంలో కీలక కార్యకర్తగా సునీల్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు కీలక సాక్ష్యాలను సేకరించిన సీబీఐ ఇటీవలే సునీల్‌ను అరెస్ట్ చేసింది.