అరుదైన రికార్డును అందుకున్న నానీ మూవీ!
- 2017లో విడుదలైన 'నేను లోకల్'
- త్రినాథరావు నక్కిన దర్శకత్వం
- యూ ట్యూబ్ లో దూసుకుపోతున్న సినిమా
- ఇప్పటివరకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్
నాని ఎప్పటికప్పుడు తెరపై కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. అలాగే తన కథల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన కథలో కొత్తదనం కోసం చివరి నిమిషం వరకూ ఆయన ట్రై చేస్తూనే ఉంటాడు. అందువలన ఆయన సినిమాలు దాదాపు ప్రేక్షకులను నిరాశపరచవు.
ఆయన చేసిన చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'నేను లోకల్' ఒకటిగా కనిపిస్తుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. 2017 ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
యూ ట్యూబ్ లో వదిలిన తరువాత ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఇంతవరకూ ఈ సినిమా 100 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. నాని కెరియర్లో యూ ట్యూబ్ వైపు నుంచి అరుదైన రికార్డును అందించింది. ఇక త్వరలో నాని నుంచి 'అంటే .. సుందరానికీ' విడుదల కానుండగా, సెట్స్ పై 'దసరా' సినిమా ఉంది.