గుంటూరు జీజీహెచ్లో రాలి పడిన పైకప్పు.. తప్పిన పెను ముప్పు
- గర్భిణీల వార్డులో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు
- ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు
- మంత్రి తనిఖీ చేసిన మరునాడే ఘటన
గుంటూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో గురువారం నాడు పెను ప్రమాదమే తప్పింది. ఆసుపత్రిలోని గర్భిణీల వార్డుకు చెందిన కారిడార్లో పైకప్పు పెచ్చులు రాలి పడిపోయాయి. ఆ సమయంలో కారిడార్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆసుపత్రిని తనిఖీ చేసిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.