మాస్క్ త‌ప్ప‌నిస‌రి,.. లేకుంటే రూ.1,000 జ‌రిమానా!: తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్

  • మళ్లీ మాస్క్ నిబంధ‌న‌ను తీసుకొచ్చిన తెలంగాణ‌
  • కేసులు పెర‌గ‌కున్నా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గానే నిబంధ‌న‌
  • ఫంక్ష‌న్లు, ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రన్న ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ 
దేశ రాజధాని ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ స‌ర్కారు కూడా అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదవుతున్న కేసుల్లో ఏమాత్రం పెరుగుద‌ల లేకున్నా కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మాస్క్ ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.  

ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "తెలంగాణ‌లో క‌రోనా ఫోర్త్ వేవ్‌కు అవ‌కాశం లేదు. రాష్ట్రంలో రోజుకు 20 నుంచి 25 కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌జ‌ల్లో 93 శాతం యాంటీబాడీస్‌ను గుర్తించాం. థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాం. అయినా కూడా ఫంక్ష‌న్లు, ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే. మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా వినియోగించాలి. మాస్క్ లేకుంటే రూ.1,000 జ‌రిమానా విధించడం జరుగుతుంది" అని ప్ర‌క‌టించారు.


More Telugu News