కొడనాడు ఎస్టేట్ చోరీ కేసు... పోలీసుల విచారణకు హాజరైన శశికళ
- జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో వాచ్‌మన్ హత్య.. చోరీ
- కనిపించకుండా పోయిన జయకు చెందిన కీలక డాక్యుమెంట్లు
- దర్యాప్తులో భాగంగానే శశికళకు పోలీసుల నోటీసులు
తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ గురువారం నాడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో గతంలో వాచ్‌మన్‌ను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు ఎస్టేట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని శశికళకు ఇటీవలే పోలీసుల నుంచి నోటీసులు వెళ్లాయి.
ఈ నోటీసులకు అనుగుణంగా గురువారం కొడనాడు ఎస్టేట్ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు శశికళ హాజరయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తులను కొల్లగొట్టేందుకే ఈ చోరీ జరిగిందన్న వాదనలు గతంలో వినిపించాయి. అంతేకాకుండా అన్నాడీఎంకేకు చెందిన కీలక డాక్యుమెంట్లు కూడా ఈ చోరీ తర్వాత కనిపించకుండా పోయాయన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.