ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డు
- ఒకే ప్రత్యర్థి జట్టుపై 1,000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా వార్నర్
- పంజాబ్ కింగ్స్ పై రాణించి రికార్డు
- మొదటి స్థానంలో 1,018 పరుగులతో రోహిత్ శర్మ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఒకే ప్రత్యర్థి జట్టుపై 1,000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గత రాత్రి పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వార్నర్ 60 పరుగులు చేశాడు. దీంతో ఒకే ప్రత్యర్థిపై 1,000 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో వార్నర్ నిలిచాడు.
ఐపీఎల్‌లో ఇప్పటికే ప్రత్యర్థి జట్టు కేకేఆర్‌పై రోహిత్ శర్మ 1,018 పరుగులు చేశాడు. ఇక ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలోనూ డేవిడ్ వార్నరే ఉండడం గమనార్హం. కేకేఆర్‌పై డేవిడ్ వార్నర్ 976 పరుగులు చేశారు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ (సీఎస్‌కేపై 949 పరుగులు) ఉన్నాడు. కాగా, ఐపీఎల్ వేలంలో వార్నరన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.