వినుకొండ వ్యక్తి కారును తీసుకెళ్లిన ఘటనపై అధికారుల చర్యలు.. ఇద్దరి సస్పెన్షన్!
- కారు తీసుకెళ్లిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం
- ఘటనపై ఏపీ సీఎం కార్యాలయం ఆరా
- హోంగార్డు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పై చర్యలు
ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ అనే వ్యక్తి కారును ఆయనకు చెప్పకుండా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీనివాస్ బయలుదేరగా ఆయనకు ఈ అనుభవం ఎదురైంది.
ఈ ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై మీడియాలోనూ వార్తలు రావడంతో.. శ్రీనివాస్ కారును తీసుకెళ్లిన సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సంధ్యను అధికారులు సస్పెండ్ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న ఘటనకు వారిని బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.
అలాగే, ఆ కారు యజమాని శ్రీనివాస్ గురించి ఏపీ సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. ఆ కారును తీసుకెళ్లాలని ఫోనులో శ్రీనివాస్‌కు పోలీసులు చెప్పారు.