ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎంత కాలం కొనసాగిస్తారు?: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనను పరిశీలించాలన్న ధర్మాసనం
- కేంద్ర ప్రభుత్వాన్ని తగిన నిర్దేశాలు కోరామన్న ప్రభుత్వం తరపు లాయర్
- రేపటి లోగా పూర్తి వివరాలతో రావాలని సుప్రీం ఆదేశం
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశాన్ని సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎంత కాలం కొనసాగిస్తారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తగిన నిర్దేశాలు కోరామని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా? అని అసహనం వ్యక్తం చేసింది. రేపటి లోగా పూర్తి వివరాలతో రావాలని... ఆ తర్వాత విచారణను వాయిదా వేయడం ఇక కుదరదని స్పష్టం చేసింది.