'పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం'.. అని ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తోన్న మొబైల్ షాప్.. వీడియో ఇదిగో
- పెట్రోల్, నిమ్మకాయల ధరల పెరుగుదలతో వాటినే ఆఫర్‌గా ప్రకటించిన వైనం
- ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘటన
- రూ.10 వేలకుపైగా విలువైన ఫోన్ కొంటే లీటరు పెట్రోలు ఫ్రీ
- మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌పై 5 నిమ్మకాయలు ఉచితం
వినియోగదారులను ఆకర్షించడానికి షాపింగ్, మాల్స్, దుకాణాలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ మొబైల్ దుకాణదారుడు కూడా ఏదైనా ఆఫర్ ప్రకటించి వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. అయితే, అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. దేశంలో పెట్రోలు, నిమ్మకాయల ధరలు పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసిలోని ఆ దుకాణదారుడు వాటినే ఆఫర్లుగా ప్రకటించాడు.
దీంతో ఆయన దుకాణానికి వినియోగదారుల తాకిడి పెరిగింది. వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ దుకాణదారుడు చేసిన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వేసవి ప్రత్యేక ఆఫర్లుగా అతడు తన స్టోర్‌లో రూ.10 వేలకుపైగా విలువైన ఫోన్లను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు చొప్పున ఉచితంగా ఇస్తానని పేర్కొన్నాడు. అలాగే, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌పై 5 నిమ్మకాయలు ఇస్తానని బోర్డులు పెట్టాడు.