చాప చుట్టేసిన పంజాబ్.. ఢిల్లీ టార్గెట్ 116 పరుగులు
- టాస్ గెలిచి పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఢిల్లీ
- 20 ఓవర్లలో 115 పరుగులు చేసిన పంజాబ్
- కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ బౌలర్లు
ఐపీఎల్ తాజా సీజన్‌లో మరో చెత్త రికార్డు నమోదైంది. బుధవారం ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 115 పరుగులకు తన ఇన్నింగ్స్‌ను ముగించింది. వెరసి ఢిల్లీ జట్టుకు 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ.. మూలుగుతూ ముక్కుతూ.. 115 పరుగుల స్కోరు వద్ద తన బ్యాటింగ్‌ను ముగించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24), జితేశ్ శర్మ (32) మాత్రమే ఓ మోస్తరుగా ఆడగా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుని పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఢిల్లీ బౌలర్లు పదునైన బంతులతో వరుసగా వికెట్లను నేలకూల్చారు. ఈ క్రమంలో పంజాబ్ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా నిలదొక్కుకుని భారీ స్కోరు చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మాద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు రెండేసి వికెట్లు తీయగా... ముస్తాఫిర్ రెహ్మాన్ ఓ వికెట్ తీశాడు.