స్కూటర్ ఖరీదు రూ.71 వేలు... ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.15 లక్షలు!
- చండీగఢ్ లో ఘటన
- హోండా యాక్టివా కొనుగోలు చేసిన వ్యాపారి
- ఫ్యాన్సీ నెంబరు కోసం వేలం
- 0001 నెంబరు కోసం రూ.15.44 లక్షలు
కొందరు తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని కోరుకుంటారు. మరికొందరు తమ లక్కీ నెంబరే వాహన రిజిస్ట్రేషన్ నెంబరు అయితే బాగుంటుందని భావిస్తారు. చండీగఢ్ కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యాపారి కూడా ఆ కోవకే చెందుతాడు. అయితే ఈయన కాస్తంత డిఫరెంట్. ఎందుకంటే తన స్కూటర్ కు ఫ్యాన్సీ నెంబరు కోసం ఏకంగా రూ.15 లక్షలకు పైగా చెల్లించాడు.
ఆ వ్యాపారి ఇటీవల రూ.71 వేలతో హోండా యాక్టివా స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే '0001' అనే ఫ్యాన్సీ నెంబరు కోరుకున్న అతగాడు ఆర్టీఏ వేలంలో రూ.15.44 లక్షలకు దాన్ని సొంతం చేసుకున్నాడు. వేలంలో ఆ నెంబరు ప్రారంభ ధర రూ.5 లక్షలు కాగా బ్రిజ్ మోహన్ చివరి వరకు వేలంలో నిలిచి తనకిష్టమైన నెంబరును దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అయింది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింది ఓ స్కూటర్ నెంబరు కోసమా..? అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.