మంత్రి హోదాలో తొలిసారి తిరుమ‌ల‌కు రోజా!

మంత్రి హోదాలో తొలిసారి తిరుమ‌ల‌కు రోజా!
  • భ‌ర్త‌తో క‌లిసి వెంక‌న్న సేవ‌లో రోజా
  • ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ద‌క్కింద‌ని వెల్ల‌డి
  • టీటీడీ అద‌న‌పు ఈవోకు ధన్య‌వాదాలు తెలిపిన మంత్రి
ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా బుధ‌వారం మంత్రి హోదాలో తొలిసారి క‌లియుగ దైవం తిరు‌మ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. భ‌ర్త‌తో క‌లిసి వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్న రోజా... ఆల‌య మ‌ర్యాద‌ల‌తో టీటీడీ అద‌న‌పు ఈవో త‌న‌కు స్వాగ‌తం ప‌లికిన వైనంపై హ‌ర్షాతిరేకం వ్య‌క్తం చేశారు.

ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్న రోజా.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి తిరుమల దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. టీటీడీ అద‌న‌పు ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో దగ్గరుండి మ‌రీ త‌న‌కు దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందించారని పేర్కొంటూ... ధ‌ర్మారెడ్డికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News