నో కరోనా ఎఫెక్ట్... ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ షురూ
- ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పలువురికి కరోనా
- మ్యాచ్ వేదికను పూణే నుంచి ముంబయికి మార్చిన బోర్డు
- టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
కొంతకాలం కిందట కరోనా అంటే హడలిపోయే పరిస్థితులు ఉన్నా, ఇప్పుడు ఆ వైరస్ ను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఐపీఎల్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పలువురు కరోనా బారినపడినప్పటికీ, ఇవాళ ఆ జట్టు పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సిన మ్యాచ్ కు ఐపీఎల్ నిర్వాహకులు పచ్చజెండా ఊపారు. అయితే వేదిక ఒక్కటే మార్చారు. పూణే నుంచి ముంబయికి తరలించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా ఢిల్లీ సారథి రిషబ్ పంత్ మాట్లాడుతూ, జట్టులో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. అయితే దాని గురించి తామేమీ ఆందోళన చెందడంలేదని స్పష్టం చేశాడు. జట్టుగా కలిసికట్టుగా ఉండడంపైనే దృష్టి సారించామని చెప్పాడు. ఇక కరోనా బారినపడిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఆడతాడని పంత్ వెల్లడించాడు. అటు, పంజాబ్ కింగ్స్ జట్టులో ఓడియన్ స్మిత్ స్థానంలో ఎల్లిస్ తుది జట్టులోకి వచ్చాడు.