సిక్కోలులో మూఢ న‌మ్మ‌కాల‌తో రెండు గ్రామాల్లో స్వీయ లాక్‌డౌన్‌

  • స‌రిబుజ్జిలిలో లాక్ డౌన్ విధించుకున్న గ్రామ‌స్థులు
  • దుష్ట శ‌క్తులున్నాయంటూ గ్రామం చుట్టూ ముళ్ల కంచెలు
  • వెన్నెలవ‌ల‌స‌లో క్షుద్ర పూజ‌లు చేస్తున్న గ్రామ‌స్థులు
  • ఈ నెల 25 వ‌ర‌కు బ‌య‌టి వారు రాకుండా ఆంక్ష‌లు
  • ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, అంగ‌న్ వాడీల‌కు తాళాలు వేసిన వైనం
ప్రాణాంక‌త క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిలువ‌రించేందుకు పలు దేశాల ప్రభుత్వాలు గతంలో లాక్ డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా కారణంగా కాకుండా.. మూఢ‌న‌మ్మ‌కాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని రెండు గ్రామాల్లో ఆయా గ్రామస్థులు స్వీయ లాక్ డౌన్ ను విధించుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

జిల్లాలోని స‌రిబుజ్జిలిలో గ్రామ‌స్థులు స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు. దుష్ట శ‌క్తులున్నాయంటూ గ్రామం చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్న గ్రామ‌స్థులు ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా, బ‌య‌టి వ్య‌క్తులు గ్రామంలోకి రాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు‌.

ఇక ఇదే జిల్లాకు చెందిన వెన్నెలవ‌ల‌స‌ గ్రామ‌స్థులు మూఢ న‌మ్మ‌కాల‌తో క్షుద్ర పూజ‌లు చేస్తున్నారు. దాంతో ఈ నెల 25 వ‌ర‌కు గ్రామంలోకి ఎవ‌రూ రాకూడ‌దంటూ ఆంక్ష‌లు విధించారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, అంగ‌న్ వాడీల‌కు తాళాలు వేసేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఈ గ్రామాల‌కు చేరుకుని ప్రజలను మూఢనమ్మకాల నుంచి బయటపడేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 


More Telugu News