వైసీపీ నాయకత్వానికి ఇదే చివరి ప్రభుత్వ పాలన: విష్ణువర్ధన్ రెడ్డి
- విష్ణువర్ధన్ రెడ్డి మీడియా సమావేశం
- కర్నూలు జిల్లాలో సంఘటనలపై ఆగ్రహం
- పోలీసుల తీరును ప్రశ్నించిన వైనం
- పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వ్యాఖ్యలు
బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. వైసీపీ నాయకత్వానికి ఇదే చివరి ప్రభుత్వ పాలన అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని... సంచలన, వివాదాస్పద, అనుమానాస్పద శాంతిభద్రతల సమస్యలు రాష్ట్రంలో ఒక్క కర్నూలు జిల్లాలోనే చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
"ఆత్మకూరులో పోలీసులు ఆస్తులు తగలబెట్టడం, హత్యాయత్నం చేయడం, పోలీసులు జైలుకు పంపడం ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. నంద్యాలలో కొన్ని మత దురహంకార సంస్థలు ఏకంగా రోడ్డు మీదకు వచ్చి, ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పాయి. మా చెప్పుచేతుల్లోనే వైసీపీ ప్రభుత్వం నడుస్తోందంటూ ఆ మత సంస్థలు ప్రకటించుకున్నాయి. వాళ్ల మీద ఇంతవరకు కేసులు పెట్టలేదు.
ఇప్పుడు కర్నూలు జిల్లాలో మరో సంఘటన జరిగింది. హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా మారణాయుధాలు, రాళ్లతో దాడి చేశారు. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అని ప్రగల్భాలు చెప్పుకునే కర్నూలు జిల్లా పోలీసు అధికారులు ఇప్పటివరకు ఒక్క ఎస్సైని గానీ, ఒక్క సీఐని గానీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? గ్యాంబ్లింగ్ చేస్తున్నారా? ఎవరిని సంతృప్తి పరిచేందుకు 40 మంది వాళ్లను అరెస్ట్ చేస్తాం, 40 మంది వీళ్లను అరెస్ట్ చేస్తాం అని చెబుతున్నారు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.