అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు ఆదేశాలను జారీ చేసిన బ్రిటన్ కోర్టు
- ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిరంగ పరిచిన వికీలీక్స్
- అమెరికాలో విచారణ ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అప్పగించాలన్న బ్రిటన్ కోర్టు
- అసాంజేకు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు అవసరమైన అధికారిక ఆదేశాలను బ్రిటన్ కోర్టు జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిరంగ పరిచి, ప్రచురించినందుకు.. అమెరికాలో విచారణను ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికాకు అప్పగించాలని ఆదేశించింది.
అయితే, ఈ ఆదేశాలపై బ్రిటన్ ఇంటీరియర్ మినిస్టర్ ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాకు ఆయనను అప్పగించేందుకు ఆమె అంగీకారం తెలిపినా.. హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అసాంజే న్యాయవాదులకు అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా అసాంజే తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, ప్రీతి పటేల్ కు వినతి పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. హైకోర్టులో అప్పీల్ కూడా చేస్తామని తెలిపారు. మరోవైపు అసాంజేను అమెరికాకు అప్పగిస్తే జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది.