ఐదు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికిన మార్కెట్లు
- ఈరోజు ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
- 574 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐదు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అప్ ట్రెండ్ లోనే కొనసాగాయి.
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 574 పాయింట్లు లాభపడి 57,037కి చేరుకుంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 17,136 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్, కన్జ్యూమర్ గూడ్స్, మెటల్ మినహా అన్ని సూచీలు లాభపడ్డాయి. ఎనిమిది సెషన్ల తర్వాత ఐటీ సూచీ కోలుకోవడం గమనార్హం.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.39%), మారుతి (3.37%), ఏసియన్ పెయింట్స్ (3.17%), రిలయన్స్ (3.03%), టీసీఎస్ (2.35%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.45%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.16%), టాటా స్టీల్ (-0.89%), ఐటీసీ (-0.75%).