విశాఖ పార్టీ బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగింత!
- విశాఖ పార్టీ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించిన అధిష్ఠానం
- విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగింత
- ఇకపై తాడేపల్లి నుంచి పని చేయనున్న విజయసాయి
ఇన్నాళ్లూ విశాఖ పార్టీ బాధ్యతలను నిర్వహించిన వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా విశాఖ బాధ్యతలతో పాటు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను కూడా వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించలేదు. విజయసాయికి ఇటీవలే పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు.