గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు
- గవర్నర్ ను కలిసిన వారిలో రఘునందన్ రావు, రాంచందర్ రావు, పొంగులేటి తదితరులు
- ప్రభుత్వ హత్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్న రఘునందన్ రావు
- పోలీసుల తీరుపై కూడా ఫిర్యాదు చేశామని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తోందని... అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీజేపీ కార్యకర్తలను అణచివేస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యల ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో రఘునందన్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును ఆమె దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కౌన్సిలింగ్ పేరుతో ప్రతిపక్ష నేతలను పోలీసులు హింసిస్తున్నారని చెప్పామని తెలిపారు. కామారెడ్డిలో సంతోష్, పద్మ, ఖమ్మంలో సాయి గణేశ్ ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. బీజేపీపై టీఆర్ఎస్ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు.