రెడ్ మీ బ్రాండ్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్ల విడుదల

  • రెడ్ మీ ఏలో రెండు వేరియంట్లు
  • రూ.8,499 నుంచి ధర ప్రారంభం
  • రెడ్ మీ 10 పవర్ లో ఒకటే వేరియంట్
  • ధర రూ.14,999
చైనాకు చెందిన షావోమీ ‘రెడ్ మీ’ బ్రాండ్ పై రెండు బడ్జెట్ ఫోన్లను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో రెడ్ మీ 10ఏ ఒకటి కాగా, రెండోది రెడ్ మీ 10 పవర్. రెడ్ మీ 10 పవర్ కాస్త ఖరీదైన ఫోన్. 

రెడ్ మీ 10 ఏ
రెడ్ మీ 10 ఏ 3జీబీ, 32జీబీ వేరియంట్ ధర రూ.8,499. 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.9,499. ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటలకు మొదటి విడత విక్రయానికి రానుంది. 6.53 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 400 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ వాడారు. వెనుక భాగంలో 14 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో ఏఐ ఫీచర్ తో కూడిన 5 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

రెడ్ మీ 10 పవర్ 
రెడ్ మీ 10 పవర్ 8జీబీ, 128జీబీ వేరియంట్ తో వస్తోంది. దీని ధర రూ.14,999. విక్రయాల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇందులో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ లో 3జీబీ ఎక్స్ టెండబుల్ ర్యామ్ సదుపాయం ఉంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సల్ పోర్ట్రయిట్ లెన్స్ ఏర్పాటు చేశారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది.


More Telugu News