కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
- టీ20ల్లో భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్స్ లలో ఎక్కువ పరుగులు
- 184 ఇన్నింగ్స్ లలో కోహ్లీ 6 వేల పరుగులు
- దానిని 166 ఇన్నింగ్స్ లలోనే అందుకున్న రాహుల్
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్ లో ఓ గొప్ప రికార్డును నమోదు చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తిచేసిన బ్యాటర్ గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా విరాట్ కోహ్లీ రికార్డును రాహుల్ తిరగరాశాడు.
184 ఇన్నింగ్స్ లలో కోహ్లీ 6 వేల పరుగుల మార్కును అందుకోగా.. రాహుల్ కేవలం 166 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ జాబితాలో క్రిస్ గేల్ , పాక్ కెప్టెన్ బాబర్ ఆజంలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా, భారత్ తరఫున శిఖర్ ధావన్ 214 ఇన్నింగ్స్ లు, సురేశ్ రైనా 217 ఇన్నింగ్స్ లు, రోహిత్ శర్మ 228 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును నమోదు చేశారు.
నిన్న రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో 30 పరుగులు చేసిన రాహుల్.. అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 6 వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్ గా ఘనతకెక్కాడు.