కేఎల్ రాహుల్ కు ఫైన్.. మార్కస్ స్టోయిన్ కు మందలింపు
- ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు ప్రకటన
- మ్యాచ్ ఫీజులో రాహుల్ కు 20 శాతం ఫైన్
- అవుట్ అయిన సందర్భంగా స్టోయినిస్ నోట అసభ్య పదజాలం
- అతడ్ని మందలింపుతో సరిపెట్టిన రిఫరీ
బెంగళూరు జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆ జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో వారిపై రిఫరీ చర్యలు తీసుకున్నారు. కేఎల్ రాహుల్ కు మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ విధించారు. హేజిల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ అయిన సందర్భంగా మార్కస్ స్టోయిన్ అసభ్య పదజాలం వాడినందున అతడ్ని మందలింపుతో సరిపెట్టారు. ఈ మేరకు ఐపీఎల్ బుధవారం ప్రకటన విడుదల చేసింది.
ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. హేజిల్ వుడ్ స్టంప్స్ కు దూరంగా సంధించిన బంతిని ఆడబోయిన స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ సందర్భంగా అతడు అసభ్య పదజాలం వినియోగించినట్టు స్టంప్ మైక్రో ఫోన్లలో రికార్డు అయింది. దీంతో అతడితోపాటు, సారథి రాహుల్ పై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.